సహకార ఎన్నికలు: నేడు నామినేషన్లకు చివరి రోజు

సహకార ఎన్నికలు: నేడు నామినేషన్లకు చివరి రోజు

యాదాద్రి భువనగిరి: ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాల (పీఏసీఎస్‌- ప్యాక్‌) నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో భారీగా భారీగా అప్లికేషన్లు రానున్నట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 21 పీఏసీఎస్‌లలో  273 వార్డులకు గానూ  432 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం గురువారం నుంచి నామినేషన్లు అధికారులు స్వీకరించారు. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా 70 నామినేషన్లు దాఖలయ్యాయి.

శుక్రవారం 2వ రోజు 432 నామినేషన్లు దాఖలు కావడంతో 2 రోజులు కలుపుకుని మొత్తం 502 నామినేషన్లు వచ్చాయని తెలిపారు. నామినేషన్లు వేసేందుకు నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉండటంతో పోటీ దారులు నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పార్టీల నుంచి హామీ కోసం కొంత మంది పోటీదారులు వేచిచూడగా చాలా వరకు శుక్రవారం మంచి ముహుర్తం ఉండటంతో నామినేషన్లు వేశారు. సమయం సమీపిస్తుండటంతో శనివారం భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. నామినేషన్‌ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టామని.. నిబంధనల ప్రకారం అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నామని చెప్పారు ఎన్నికల అధికారులు.

చందుపట్ల పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్ధిగా కాంగ్రెస్ సీనియర్ నేత మందడి లక్ష్మీనర్సింహ్మా రెడ్డి తన పాలకవర్గ సభ్యుల పేర్లను ఖరారు చేసుకుని.. ఒకేసారి నామినేషన్లు వేయడంతో గ్రామంలో సందడి నెలకొంది. ప్రత్యర్థ్ధులకు భయాన్ని కలిగించారు. రెండవ రోజు నామినేషన్ల పర్వం భారీగానే కొనసాగిందని.. నేడు పూర్తి స్థాయిలో నామినేషన్లు వేస్తామని తెలిపారు MLN రెడ్డి.

ఎన్నికల షెడ్యూల్

ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 9వ తేదీన వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు విధించారు. అదేరోజు సాయంత్రం అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. ఫిబ్రవరి 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అదేరోజు కౌంటింగ్‌ పూర్తిచేసి, ఫలితాలు ప్రకటిస్తారు.