కశ్మీర్‌‌లో టెర్రర్ అటాక్.. ఒక పోలీస్ మృతి

V6 Velugu Posted on Jan 29, 2022

జమ్ము కశ్మీర్‌‌లో పోలీసులపై శనివారం అకస్మాత్తుగా టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక పోలీస్ మరణించినట్లు జమ్ము కశ్మీర్‌‌ పోలీసు అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌‌లోని అనంత్‌నాగ్ జిల్లా హసన్ పొరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. టెర్రరిస్టులు ఉన్నట్టుండి కాల్పులకు పాల్పడడంతో అలీ ముహమ్మద్ అనే హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో అతడిని వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయిందని, అలీ ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. మరోవైపు ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

బీజేపీ నేత హత్య: నిందితుల్ని పట్టిస్తే రూ.2.5 లక్షల నజరానా

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్

ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు!

Tagged POLICE, kashmir, Jammu

Latest Videos

Subscribe Now

More News