పెంపుడు కుక్కతో వచ్చి చిక్కుల్లో పడ్డ ప్రధాని

పెంపుడు కుక్కతో వచ్చి చిక్కుల్లో పడ్డ ప్రధాని

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల కారులో సీటు బెల్టు ధరించకుండా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఆయన.. మరోసారి తన పెంపుడు కుక్క వల్ల రూల్స్ ను బ్రేక్ చేయాల్సి వచ్చింది. పార్కులోకి వన్య ప్రాణులను బంధించి తీసుకురావాలన్న నిబంధనను సునాక్ క్రాస్ చేశారు. అది గమనించిన సిబ్బంది సునాక్ కు నిబంధనలను గుర్తు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి యుకె ప్రధాన మంత్రి రిషి సునక్ లండన్ లోని హైడ్ పార్క్ కు వెళ్లారు. ఈ సమయంలో తన వెంట తీసుకువచ్చిన పెంపుడు కుక్కను పార్కులో స్వేచ్ఛగా వదిలేశారు. అలా జంతువుల్ని వదిలేయడం అక్కడి రూల్స్ కు విరుద్ధం. స్వేచ్ఛగా సంచరిస్తోన్న కుక్కను గమనించిన సిబ్బంది వెంటనే సునాక్ వద్దకు చేరుకుని నిబంధనలను గుర్తు చేశారు. దాంతో పాటు కుక్క మెడకు పట్టీ పెట్టి సునాక్ కు అందించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకరు చిత్రీకరించి టిక్ టాక్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ టాపిక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సునాక్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని పోలీసులు స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేస్తున్న రోజుల్లో ప్రధాని రిషి సునాక్ కారులో సీటు బెల్టు పెట్టుకోకుండా ప్రయాణించారు. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ ఆయనకు ట్రాఫిక్ పోలీసులు 50 పౌండ్ల జరిమానా విధించారు. అదే కాకుండా అప్పట్లో అత్యంత సంచలనంగా మారిన "పార్టీగేట్" కుంభకోణంలో భాగంగా కొంతమందికి జరిమానా విధించారు. వారిలో అప్పటి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో సహా సునాక్ కూడా ఉండడం గమనార్హం.