‘లోహ్రీ’ మంటల్లో అగ్రి చట్టాల కాపీలు

‘లోహ్రీ’ మంటల్లో అగ్రి చట్టాల కాపీలు

ఢిల్లీ బార్డర్లలో రైతుల వినూత్న నిరసనలు
పంజాబ్‌లో కూడా కొనసాగిన ఆందోళనలు
ఇవాళ 9వ రౌండ్ చర్చలు

చండీగఢ్/న్యూఢిల్లీ: పండుగపూట.. చలిలో.. ఢిల్లీ బార్డర్లలో ప్రొటెస్టులు చేస్తున్నారు రైతులు. చర్చలు, సమస్యల పరిష్కారం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా.. 3 వ్యవసాయ చట్టాల కాపీలను లోహ్రీ(పంజాబీ పండుగ) మంటల్లో పడేశారు. బుధవారం లోహ్రీ సందర్భంగా ఇలా ప్రొటెస్టులు చేశారు. మరోవైపు పంజాబ్​లో కూడా రైతులు ఇదే విధంగా నిరసనలు చేశారు. చట్టాల కాపీలను మంట ల్లో పడేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. తమ డిమాండ్లను అంగీకరించకపోవడంపై మండిపడ్డారు. కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. అమృత్​సర్​లోని పంధేర్ కలన్ గ్రామంలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి మహిళలు ఆందోళనలు చేశారు.

ప్రధాని మోడీని కలిసిన దుష్యంత్ చౌతాలా

రైతుల ఆందోళనల సెగ ఎదుర్కొంటున్న హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా.. ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రైతుల ప్రొటెస్టులపై పీఎంతో చర్చించారు. మంగళవారం కూడా కేంద్ర హోం మంత్రి అమిత్​షాను.. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్​తోపాటు వెళ్లి చౌతాలా కలిశారు.

15న మళ్లీ చర్చలు

శుక్రవారం రైతులతో చర్చలు జరపనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పర్షోత్తం రూపాలా చెప్పారు. రైతులతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, చర్చలతోనే పరిష్కారం వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందుకు వెళ్లబోమని చెప్పిన రైతులు.. చర్చలకు మాత్రం ఓకే చెప్పారు. చట్టాల రద్దు తప్ప దేన్నీ తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటిదాకా జరిగిన 8 రౌండ్ల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

ఇవీ చదవండి..

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

జాక్‌మా కంపెనీలను జాతీయం చేసే యోచనలో చైనా

సంక్రాంతి వేడుకంతా రైతుదే