హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో కార్డన్ సెర్చ్.. భారీగా లిక్కర్ బాటిళ్లు, సిలిండర్లు, గుట్కా ప్యాకెట్లు సీజ్

హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో కార్డన్ సెర్చ్.. భారీగా లిక్కర్ బాటిళ్లు, సిలిండర్లు, గుట్కా ప్యాకెట్లు సీజ్

హైదరాబాద్ కుత్భుల్లాపూర్ పరిధిలో గురువారం (జులై 31) పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమతి లేని వస్తువులు, స్మిగ్లింగ్, దొంగిలించిన వస్తువులు మొదలైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుతో  పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లో సెర్చ్ ఆపరేషన్ చేశారు. దేవరాంజల్, మల్లన్న కాలనీ ల్లో 283 సిబ్బందితో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి పలు వస్తువులను సీజ్ చేశారు.

సాయత్రం దాదాపు 620 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 300 నిషేధిత గుట్కా  ప్యాకెట్లు, సరైన పత్రాలు లేని 38 బైక్ లను సీజ్ చేశారు. అదే విధంగా అనుమతి లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న 74 లీటర్ల మద్యం సీసాలతో పాటు, అనుమతి లేని 63 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

ఒక రౌడీ షీటర్, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా మీడియాతో కార్డన్ సెర్చ్ వివరాలు వెళ్లడించారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. అసాంఘిక కార్యకలపాలు జరగకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచడమే కార్డన్ సెర్చు ఉద్దేశమని చెప్పారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఇతర రాష్ట్రాల వారైనా, స్థానికులైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.