
జీడిమెట్ల, వెలుగు: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరయంజాల్, మల్లన్న కాలనీలో గురువారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 62 ఇళ్లల్లో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 38 బైకులు సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 74 లీటర్ల మద్యం సీసాలు, 63 సిలిండర్లు, 300 నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 283 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.