
- ముగ్గురు ఫేక్ డాక్టర్లు పట్టివేత.. మరో ఐదుగురు పరార్
- జనగామ జిల్లాలో ఎన్ఎంసీ తనిఖీల్లో గుట్టురట్టు
జనగామ, వెలుగు : టెన్త్ కూడా పాస్ కాలేదు. కానీ.. ఫేక్ డాక్టర్‌గా చెలామణి అవుతూ.. జనగామ జిల్లాలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ టీమ్ తనిఖీల్లో పట్టుబడ్డారు. ముగ్గురు ఫేక్ డాక్టర్లు పట్టుబడగా మరో ఐదుగురు పరార్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ ఘన్పూర్ శివుని పల్లిలో శుక్రవారం ఎన్ఎంసీ టీమ్ పలు క్లీనిక్ లపై దాడి చేసింది. టెన్త్ పాసవని అన్నదమ్ములు పి. సదానందం, పి. సంపత్ డాక్టర్లుగా చెలామణి అవుతూ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు పేషెంట్లకు ఇస్తుండడమే కాకుండా బ్లెడ్ టెస్టులకు గ్లోరీ డయాగ్నస్టిక్ సెంటర్ రెఫర్ చేస్తూ కమీషన్లు తీసుకుంటున్నట్లు తేలింది. పాలకుర్తి రోడ్‌లోని నాగరాజు మెడికల్ స్టోర్‌ను విద్యాసాగర్ నిర్వహిస్తూ.. ఎలాంటి అర్హతలు లేకుండా ట్రీట్ మెంట్ చేస్తున్నట్టు గుర్తించారు.
అభిలాష్, జోగేశ్వర్, కిషన్‌రాజు, సంజీవ్, మల్లేశ్ అనే ఫేక్ డాక్టర్లు తప్పించుకున్నట్లు ఎన్ఎంసీ టీమ్ తెలిపింది. ఫేక్ డాక్టర్లపై జనగామ డీఎంహెచ్ఓ మల్లికార్జున్‌రావుకు కంప్లయింట్ చేసింది. కాగా, రైల్వే స్టేషన్ఎదురుగా బీహెచ్ఎంఎస్ (హోమియోపతి డాక్టర్) శ్రీనివాస్ రోగులకు యాంటీ సైకోటిక్ మెడిసిన్ ఇస్తూ పట్టబడగా ఆయుష్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది. తనిఖీల్లో ఎన్ఎంసీ టీమ్ డాక్టర్లు వి. నరేశ్ కుమార్, అన్వర్‌మియా, కె. వెంకటస్వామి పాల్గొన్నారు.