కరెంట్ ‌‌ తీగలు తగిలి.. కాలిపోయిన మొక్కజొన్న పంట

 కరెంట్ ‌‌ తీగలు తగిలి..  కాలిపోయిన మొక్కజొన్న పంట

తాడ్వాయి, వెలుగు: ట్రాన్స్ ‌‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా చేతికి అందివచ్చిన పంట కాలిపోయింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బండారి రాములు రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. పంట చేతికొచ్చిన సమయంలో తన పొలంపై ఉన్న కరెంట్ తీగలు ఒకదానికొకటి తగిలి చేన్లో మిరుగులు పడి మంటలు అంటుకున్నాయి.

దీంతో పంట మొత్తం కాలిపోయింది.  పంట చేనులో కరెంట్ తీగలు వేలాడుతున్నాయని ఎన్ని సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని రైతులు రాములు ఆవేదన వ్యక్తం చేశారు.  మరో రైతు విఠల్ రావ్ మాట్లాడుతూ.. ప్రాణాలు పోతే గాని స్పందించారా అంటూ ట్రాన్స్‌ కో  అధికారుల పనితీరుపై మండిపడ్డాడు.  వెంటనే విద్యుత్ ‌‌ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.