మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు పెట్టాలి .. జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లిలో రైతుల ధర్నా

మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు పెట్టాలి .. జగిత్యాల జిల్లా  మెట్‌‌పల్లిలో రైతుల ధర్నా

కోరుట్ల,వెలుగు:  మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం వెంటనే సెంటర్లను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్​పల్లి టౌన్ రైతు వేదిక ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి  పాత బస్టాం డ్​వరకు రైతులు ర్యాలీగా వెళ్లారు. పాత బస్టాండ్ శాస్ర్తి చౌరస్తా వద్ద రాస్తారోకో, ధర్నా చేశారు.  రైతులు మాట్లాడుతూ.. పంటను  ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  ధర్నాతో హైవే రోడ్డుపై ట్రాఫిక్​ ఏర్పడింది. ఆర్డీఓ శ్రీనివాస్​, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.