
హైదరాబాద్: సరూర్ నగర్ గ్రీన్ పార్క్ కాలనీలో కిడ్నాప్ కలకలం రేగింది. గ్రీన్ పార్క్ కాలనీ రోడ్డు నెంబర్ 9 లో నివాసం ఉండే నాగభూషణం అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. మొక్కజొన్న వ్యాపారం చేసే నాగభూషణం కిడ్నాప్ కు గురికావడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సరూర్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.