కేసీఆర్ ‌‌ అన్నీ ఇచ్చిండు..రుణమాఫీ, ఇండ్లే బాకీ ఉన్నయ్ : మంత్రి హరీశ్ ‌‌రావు‌

కేసీఆర్ ‌‌ అన్నీ ఇచ్చిండు..రుణమాఫీ, ఇండ్లే బాకీ ఉన్నయ్ : మంత్రి హరీశ్ ‌‌రావు‌
  • కాంగ్రెస్ ‌‌ గెలిస్తే..కరువొస్తది, కరెంట్ ‌‌ పోతది
  • రిస్క్ ‌‌ తీసుకోవద్దు.. బీఆర్‌ఎస్‌నే గెలిపించాలె

వరంగల్‍/మహబూబాబాద్/పాలకుర్తి/జనగామ/బచ్చన్నపేట, వెలుగు : ‘దేవున్ని ఐదు కోరికలు కోరుకుంటే ఒకటో, రెండో తీరుతయ్ ‌‌, కానీ కేసీఆర్ ‌‌ అంతకంటే ఎక్కువే చేసిండు.. అలాంటి కేసీఆర్ ‌‌ను సాదుకోవాలా.. సంపుకోవాలా’ అని మంత్రి హరీశ్ ‌‌రావు ప్రశ్నించారు. ‘ఇప్పటికే అన్నీ ఇచ్చిండు.. ఇక రుణమాఫీ, ఇండ్లు కట్టిచ్చుడే బాకీ ఉంది.. ఎలక్షన్లు అయిపోగానే అవి కూడా పూర్తి చేస్తాం’ అని చెప్పారు. పాలకుర్తి క్యాండిడేట్ ‌‌ ఎర్రబెల్లి దయాకర్ ‌‌రావు, నర్సంపేట క్యాండిడేట్ ‌‌ పెద్ది సుదర్శన్ ‌‌రెడ్డి, మహబూబాబాద్ ‌‌ క్యాండిడేట్ ‌‌ బానోతు శంకర్ ‌‌నాయక్ ‌‌, జనగామ క్యాండిడేట్ ‌‌ పల్లా రాజేశ్వర్ ‌‌రెడ్డి తరపున శనివారం ఆయా నియోజకవర్గాలలో రోడ్ ‌‌షోలు, కార్నర్ ‌‌ మీటింగ్ ‌‌లు నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్ ‌‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ‌‌ గెలిచి కరెంట్ ‌‌ పోతే జిమ్మేదార్ ‌‌ ఎవరని ప్రశ్నించారు. జనాలు రిస్క్ ‌‌లో పడితే మాకు సంబంధం లేదన్నారు. రేవంత్ ‌‌రెడ్డి ఢిల్లీ వెళ్లి రైతుబంధు ఆపే ప్రయత్నం చేసినా శుభవార్తే వచ్చిందన్నారు. కాంగ్రెస్ ‌‌ కర్నాటకలో ఐదు గ్యారంటీలు ఇస్తే అందులో కరెంట్ ‌‌ బంద్ ‌‌, స్కాలర్ ‌‌షిప్ ‌‌లో 80 శాతం కోత, రైతు బంధుకు రాంరాం చెప్పాలని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ‌‌ ప్రభుత్వం వస్తే పేకాట క్లబ్బులు ఏర్పాటవుతాయన్నారు. కాంగ్రెస్ ‌‌ గెలిస్తే కరువొస్తదని, రైతు బంధు పోతదని, కరెంట్ ‌‌ కట్ ‌‌ అయితదని విమర్శించారు. పాలకుర్తి కాంగ్రెస్ ‌‌ క్యాండిడేట్ ‌‌ అమెరికాలో విల్లాలు గిఫ్ట్ ‌‌గా ఇచ్చి టికెట్లు కొన్నారని కాంగ్రెస్ ‌‌ లీడర్లే విమర్శిస్తున్నారన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ స్పూర్తితో ఉన్న పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు.

దయాకర్ ‌‌రావును గెలిపిస్తే అందరికీ గిరిజన బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 12 సార్లు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ ‌‌ కావాలో ? 12 మంది సీఎంలు ఉన్న కాంగ్రెస్ ‌‌ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. 24 గంటల కరెంట్ ‌‌ కావాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ‌‌ను నమ్మితే మరో పదేళ్లు వెనుకబడి పోతామన్నారు. జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ ‌‌రెడ్డిని గెలిపిస్తే జనగామ అన్ని రంగాల్లో డెవలప్ ‌‌ అయితదని చెప్పారు. 

నెలలోపు నెక్కొండను మున్సిపాలిటీ చేస్తాం

నెక్కొండ/నర్సంపేట, వెలుగు : నర్సంపేటలో పెద్ది సుదర్శన్ ‌‌రెడ్డిని గెలిపిస్తే నెలలోపే నెక్కొండను మున్సిపాలిటీ చేస్తామని మంత్రి హరీశ్ ‌‌రావు హామీ ఇచ్చారు. నర్సంపేటలో ఉన్న సివిల్ ‌‌ హాస్పిటల్ ‌‌ను నెక్కొండకు షిఫ్ట్ ‌‌ చేస్తామని చెప్పారు. ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వచ్చే వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ‌