కరోనా భోగి మంటల్లో భస్మం అయిపోయింది: సీనినటుడు మోహన్ బాబు

కరోనా భోగి మంటల్లో భస్మం అయిపోయింది: సీనినటుడు మోహన్ బాబు

చిత్తూరు: గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందర్నీ భయభ్రాంతులకు గురిచేసిన కరోనా భోగి మంటల్లో కాలి భస్మం అయిపోయిందని సినీనటుడు మోహన్ బాబు అన్నారు. సంక్రాంతి పండుగను తన స్వగ్రామంలో జరుపుకునేందుకు వచ్చిన ఆయన తన కుమార్తె మంచు లక్ష్మితో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మకర సంక్రాంతి సందర్భంగా లక్ష్మిదేవి ప్రతి ఇంటికీ వచ్చి అందరినీ క్షేమంగా ఉంచాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా అందరూ తమ పూర్వీకులు.. పెద్దలను స్మరించుకుని వారిని తగిన రీతిలో గౌరవించుకోవాలని సూచించారు. ‘‘పండుగ సందర్భంగా కరోనా భస్మం అయిపోవాలని కోరుకుంటున్నా.. నాకు తెలిసి ఇప్పటికే భోగి మంట్లో భస్మం అయిపోయి ఉంటుంది’’ అని మోహన్ బాబు పేర్కొన్నారు. తిరుమలలో అవినీతి రహిత పరిపాలన జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన కితాబునిచ్చారు. అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అవినీతికి తావులేకుండా అందరికి ఒకే విధంగా దర్శనభాగ్యం కల్పించడం చాలా సంతోషకరమన్నారు. మంచి లక్ష్మి మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరంలో శ్రీవారిని రెండు సార్లు దర్శించుకోవడం సంతోషంగా ఉందని.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తిరుమలలో చాలా మార్పు కనిపిస్తోందని, దర్శనం కోసం వచ్చే వారినందరినీ సమానంగా చూస్తూ అవినీతి రహితంగా జరుగుతుండడం సంతోషకరం అన్నారు. ఎవరైనా సరే ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని.. తమలాగే దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం వల్ల క్రమ పద్దతిలో స్వామి వారి దర్శన భాగ్యం ప్రతి భక్తుడికి జరుగుతోందన్నారు మంచు లక్ష్మీ.

ఇవీ చదవండి..

జేఈఈ స్టూడెంట్ల కోసం అమెజాన్ అకాడమీ

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

హెల్మెట్ లేకుండా బైకు నడిపిన చిరు వ్యాపారికి రూ.1.13 లక్షల జరిమానా

సంక్రాంతి వేడుకంతా రైతుదే