దేశంలో మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు

భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా విజృంభిస్తుండటంతో రోజువారీ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,95,041 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం బాధితుల సంఖ్య 1,56,16,130కు చేరింది. మంగళవారం దేశవ్యాప్తంగా 1,67,457 మంది డిశ్చార్జ్ కాగా... మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,32,76,039గా నమోదైంది. ఇక నిన్న ఒక్కరోజే  దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2,023 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,82,553గా రికార్డయింది. ప్రస్తుతం దేశంలో 21,57,538 యాక్టివ్ కేసులున్నాయి. 

దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 54 శాతం కేసులు కేవలం 5 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. ఇండియాలో గత వారం రోజుల్లో 16.29 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.