V6 News

దేశంలో ఎనిమిదికి చేరిన కరోనా మరణాలు

దేశంలో ఎనిమిదికి చేరిన కరోనా మరణాలు

భారత్‌లో కరోనా మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా ముగ్గురు మరణించగా.. సోమవారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 55 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అతడు ఇటీవల ఇటలీ నుంచి కోల్‌కతా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హార్ట్ ఫెయిల్యూర్‌తో మరణించాడు.

దేశంలో కరోనా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. సోమవారం ఉదయం 10.30 గంటల సమయానికి దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 415కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో 24 మంది డిశ్చార్జ్ కాగా.. ఎనిమిది మంది మరణించారు. ఆదివారం ఒక్క రోజులు ముంబై, పాట్నా, సూరత్‌లతో ఒక్కొక్కరు చొప్పున దేశ వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు.

రాష్ట్రాల వారీగా మృతుల సంఖ్య

  • మహారాష్ట్ర – 2
  • ఢిల్లీ – 1
  • కర్ణాటక – 1
  • పంజాబ్ – 1
  • బీహార్ – 1
  • గుజరాత్ – 1
  • పశ్చిమ బెంగాల్ – 1