కరోనా కలకలం: డ్రంక్ అండ్ డ్రైవ్ నిలిపివేత?

V6 Velugu Posted on Apr 19, 2021

దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలను కరోనా వణికిస్తోంది. 


పోలీస్‌ శాఖను కూడా కరోనా కలవరపెడుతోంది. ఈ క్రమంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేయాలంటేనే పోలీసులు వణికిపోతున్నారు. ఇప్పటికే ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకరికి కరోనా సోకగా.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లతో కరోనా మరింత విజృంభిస్తోందని భయపడిపోతున్నారు. ఇప్పటికే పలువురు పోలీస్‌ సిబ్బంది కరోనాతో మృతి చెందారు.  దీంతో ఇవాళ్టి(సోమవారం) నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ ను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. 

Tagged Telangana, corona effect, Police Department, Drunk and Drive Cessation

Latest Videos

Subscribe Now

More News