చొప్పదండి, వెలుగు: బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. చొప్పదండి మండలం రుక్మాపూర్ కు చెందిన ఏముండ్ల రాము(18), రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
కాలేజీ హాస్టల్ లోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి రాము న్యూ ఇయర్ వేడుకలు చేసుకునేందుకు బయటకు వెళ్లాడు. తిరిగి గురువారం ఉదయం హాస్టల్కు వచ్చినట్లు తెలిసింది.
ఆ తర్వాత హాస్టల్ రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు తరలివెళ్లారు. ఏముండ్ల నాగరాజుకు ఇద్దరు కొడుకులు (కవలలు), ఒక కూతురు ఉన్నారు. కాగా.. పెద్ద కొడుకు రాము మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
