యాదగిరిగుట్ట/భైంసా, వెలుగు: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో న్యూ ఇయర్ సందడి నెలకొంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో యాదగిరిగుట్టలోని కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు, కొండపైన బస్ బే, ప్రధానాలయ ప్రాంగణం, ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్, దర్శన, ప్రసాద క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మరోవైపు బాసర క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సరస్వతి దేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
