సీఎం రేవంత్ ని కలిసిన డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి..క్రైమ్స్ పై 2025 వార్షిక నివేదిక అందజేత

సీఎం రేవంత్ ని కలిసిన డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి..క్రైమ్స్ పై 2025 వార్షిక నివేదిక అందజేత

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: న్యూఇయర్ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి, అడిషనల్ డీజీ(లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌) మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ గురువారం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని కలిశారు. సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో తగ్గిన క్రైమ్‌‌‌‌ రేట్‌‌‌‌, శాంతిభద్రతల గురించి వివరించారు.ఈ మేరకు2025 వార్షిక నివేదికను అందించారు. 2024 కంటే  2025లో ఓవర్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ రేట్‌‌‌‌ 2.33 శాతానికి తగ్గిందని తెలిపారు. 

ఈ సంవత్సరం కూడా నేరాలను మరింత తగ్గించేందుకు కృషి చేస్తామని సీఎంకు వెల్లడించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా, డీఐజీ శ్రీనివాస్‌‌‌‌, ఐజీ సంపత్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌లు కూడా సీఎంను కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జైలు అధికారులు తీసుకొచ్చిన జైళ్లశాఖ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌, డైరీని సీఎం ఆవిష్కరించారు.