థర్డ్‌ వేవ్‌: మహారాష్ట్రలో 8వేల మంది చిన్నారులకు కరోనా

థర్డ్‌ వేవ్‌: మహారాష్ట్రలో 8వేల మంది చిన్నారులకు కరోనా

సెకండ్ వేవ్ తో తీవ్ర ఇబ్బందులు పడిన భారత్ కు.. ఇప్పుడు థర్డ్‌ వేవ్‌లో టెన్షన్ పట్టుకుంది. కొన్ని రాష్ట్రాల్లో థర్డ్‌ వేవ్ క్రమంగా వ్యాప్తిస్తోంది. దేశంలో వైరస్‌ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్రను థర్డ్‌ వేవ్‌ కలవరపెడుతోంది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో 8 వేల మందికి పైగా చిన్నారులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడిన ఆ చిన్నారులకు ట్రీట్ మెంట్ అందించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం ఐదుగురు పిల్లలు చికిత్స పొందుతున్నారు.

జిల్లాలోని చిన్నారుల్లో 10శాతం మందికి కరోనా కేసులు నమోదయ్యాయని అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. థర్డ్‌ వేవ్ నుంచి పిల్లలను రక్షించుకునేందుకు  చిల్డ్రన్స్  స్పెషలిస్టు డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సెకండ్ వేవ్ సమయంలో పడకలు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది. కాబట్టి, మూడవ దశ సమయంలో మనం దానిని నివారించాలన్నారు ఎమ్మెల్యే సంగ్రామ్ జగ్తాప్. థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

మూడో దశలో కరోనా చిన్నారులను టార్గెట్‌ చేస్తుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పటికే  పలు రాష్ట్రాలు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాయి.