ఏపీ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం.. 8 మంది విద్యార్థులకు కరోనా

ఏపీ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం.. 8 మంది విద్యార్థులకు కరోనా

దేశవ్యాప్తంగా రోజూ వేల కొద్దీ క‌రోనా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కొన్ని ప్ర‌భుత్వాలు స్కూళ్లను తెరుచుకోడానికి కూడా అనుమతివ్వడం తెలిసిందే. అయితే స్కూళ్లలో సరైన ఆరోగ్య పరీక్షలు జరగడం లేదని తెలుస్తోంది. కేవలం శానిటైజ్, మాస్కులతో కరోనాను అడ్డుకోవడం సాధ్యం కాదని తేలిపోయింది. ఓ వైపు శీతాకాలంలో సెకండ్‌ వేవ్‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి మోడీ సహా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఏపీ ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టి పాఠశాలను ప్రారంభించింది.

ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం వల్ల కామవరపుకోట మండలం ఈస్ట్ఎడవల్లిలో 8 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా సోకింది. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 చదువుతున్న 27 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు..