కరోనా పేషెంట్‌ పారిపోయిండు…శవమై కనిపించిండు

కరోనా పేషెంట్‌ పారిపోయిండు…శవమై కనిపించిండు

భద్రాద్రికొత్తగూడెంలో ఘటనభద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఐసోలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఇద్దరు చనిపోవటంతో భయంతో అక్కడి నుంచి పారిపోయినపేషెంట్.. మరుసటి రోజే శవమై కనిపించిండు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లో జరిగిందీ ఘటన. దమ్మపేటమండలం నాచారం గ్రామానికి చెందిన పిల్లివెంకటేశ్వర్లు (35)కు కరోనా సోకడంతో గతనెల 28న కొత్తగూడెంలోనిప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లోచేర్చారు. 30వ తేదీన కరోనా రోగుల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో భయాందోళనకు గురైన వెంకటేశ్వర్లు30వ తేదీ రాత్రి ఐసోలేషన్ సెంటర్ నుంచి పారిపోయాడు. ఉదయం గమనించిన అతడి కుటుంబసభ్యులు విషయాన్ని డాకర్ట్ల దృష్టికి తీసుకువచ్చారు. తర్వాత పట్టణంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున వెంకటేశ్వర్లు పట్టణంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో శవమై కనిపించాడు. పోలీస్లుడెడ్ బాడీనిప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర్లుహాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోజంతాబయటే తిరిగినట్లుతెలిసింది. దీంతో అతడి వల్ల ఎంత మందికి వైరస్ అంటిందోనని ఆఫీసర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు కరోనా రోగులు ఐసోలేషన్ సెంటర్ నుంచి బయటకువచ్చి దగ్గర్లోని హోటళ్ళలో టీ తాగి వెళ్తున్నట్టు సమాచారం. అదీకాక గతంలోనూ ఓ కరోనా పేషెంట్ పారిపోయాడు.