తెలంగాణ ఇంటర్ బోర్డులో 18 మందికి కరోనా పాజిటివ్

V6 Velugu Posted on Jul 01, 2020

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న అన్ని వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు వైరస్ బారిన పడుతున్నారు. లేటెస్టుగా హైదరాబాదులోని ఇంటర్మీడియట్ బోర్డులో పని చేస్తున్న అధికారులు, సిబ్బందికి వైరస్ సోకింది. దీంతో ఇతర ఉద్యోగులకు కూడా టెస్టులు చేయించగా… మొత్తం 18 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరి కొందరు ఉద్యోగుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. దీంతో మిగతా ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ వ్యాపించడంతో  బోర్డు కార్యాలయాన్ని అధికారులు శానిటైజ్ చేయిస్తున్నారు.

Tagged Corona Positive, telangana inter board, 18 people

Latest Videos

Subscribe Now

More News