
సెకండ్ వేవ్ లో ముంబై లో భారీగా కరోనా కేసుల సంఖ్య నమోదయ్యాయి..ఇప్పుడు కూడా మళ్లీ కరోనా కేసులు అమాంతం విజృంభిస్తున్నాయి. కరోనా వారియర్స్ గా పనిచేసే డాక్టర్లపై ఈ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. ముంబై మహానగరంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నక్రమంలో గత మూడు రోజుల్లోనే 260 మంది రెసిడెంట్ డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని JJ హాస్పిటల్ చాప్టర్ అధ్యక్షుడు గణేష్ సోలుంకీ బుధవారంతెలిపారు.
కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (KEM) ఆస్పత్రిలో 60 మంది రెసిడెంట్ డాక్టర్లు, లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆస్పత్రిలో 80 మంది, ఆర్‌ఎన్ కూపర్ ఆస్పత్రిలో మరో ఏడుగురు కూడా వైరల్ ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డారని సోలంకి తెలిపారు.
మరిన్ని వార్తల కోసం...