సీఎం ఉద్ధవ్ థాక్రేకు కరోనా పాజిటివ్

సీఎం ఉద్ధవ్ థాక్రేకు కరోనా పాజిటివ్


మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. ప్రస్తుతం సీఎం ఉద్ధవ్ థాక్రే, గవర్నర్ కొష్యారీ కరోనా పాజిటివ్గా తేలారు. ప్రభుత్వ మనుగడ క్లైమాక్స్లో ఉందన్న సమయంలో కరోనా రావడంతో వ్యవహారం అంతా కీలకంగా మారింది. ఉద్ధవ్ థాక్రే  కాసేపట్లో రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే క్యాబినెట్ మీటింగ్కు ముందు కరోనా టెస్టులు చేయించుకోగా ఉద్ధవ్ పాజిటివ్గా తేలారు.  దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది. కరోనా పాజిటీవ్ తేలినా..సీఎం  ఉద్ధవ్ థాక్రే జూమ్ ద్వారా కేబినెట్ మీటింగ్లో పాల్గొంటారు. 

ఇంకోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ మీటింగ్కు ఏఐసీసీ పరిశీలకుడిగా వచ్చిన కమల్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నుంచి 44 మంది ఎమ్మెల్యేలు మీటింగ్కు హాజరయ్యారని కమల్ నాథ్ అన్నారు. ఉద్ధవ్కు కరోనా వచ్చిందని కమల్ నాథే మీడియాకు చెప్పారు. 


...
మరోవైపు రెబెల్స్ గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ లోనే ఉన్నారు. శివసేనతో కలిసే ప్రసక్తే లేదని బాలాసాహెబ్ నిజమైన వారసుడిగా కొనసాగుతామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా 40 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.