మహేష్‌ బాబుకు కరోనా పాజిటివ్‌

మహేష్‌ బాబుకు కరోనా పాజిటివ్‌

సినీనటుడు మహేష్ బాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా  ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో డాక్టర్ల సలహాతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానన్నారు. గత కొద్దీ రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్‌ టెస్ట్‌లు చేసుకోవాలన్నారు.  ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే తిరిగి షూటింగ్ కు వెళ్లాలని ఎదురుచూస్తున్నానని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు  మహేష్ బాబు.