సినీ నటుడు అల్లు అర్జున్ కు కరోనా

V6 Velugu Posted on Apr 28, 2021

టాలీవుడ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. లేటెస్టుగా నటుడు అల్లు అర్జున్ కూడా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తనకు కరోనా సోకినట్టు మెడికల్ టెస్టుల్లో నిర్ధారణ అయ్యిందన్నాడు. అవసరమైన జాగ్రత్తలు, డాక్టర్ల సూచనలు పాటిస్తూ ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పాడు. ఇటీవల తనను కలిసిన వాళ్లు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరాడు.

అవసరం అయితే తప్ప బయటకు రావద్దని..ఇంటి దగ్గరే ఉంటూ సురక్షితంగా ఉండంలాని ట్విట్టర్ ద్వారా తెలిపాడు బన్నీ. అంతేకాదు  మీ వంతు వచ్చినప్పుడు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నాడు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని శ్రేయోభిలాషులకు, అభిమానులకు తెలిపాడు. 

 

 

Tagged Corona Positive, movie star, Allu Arjun

Latest Videos

Subscribe Now

More News