
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. లేటెస్ట్ గా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. డాక్టర్ల సూచనలతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజుల్లో తనని కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని,కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ విద్యాశాఖకు సంబంధించిన పనులు యధాతథంగా జరిగేలా చూస్తామన్నారు మంత్రి రమేశ్ పోఖ్రియాల్.