కరోనా సోకినా..ఆస్పత్రి ఫ్లోర్ ను తుడిచిన మంత్రి

V6 Velugu Posted on May 15, 2021

ఆయన ఓ రాష్ట్రానికి మంత్రి అయినా.. ఓ ఆస్పత్రిలో ప్లోర్ ను క్లీనింగ్ చేశారు. అది కూడా కరోనాతో బాధపడుతూనే. మిజోరం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్. లాల్ జిర్లియానా ఇటీవలే కరోనా బారినపడ్డారు. ఐజ్వాల్ లోని ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆయన భార్య, కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో..అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి లాల్ జిర్లియానా తాను చికిత్స పొందుతున్న గది క్లీన్ గా లేక పోవడంతో ఆ ఆస్పత్రి స్వీపర్స్ కు ఫోన్ చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తానే.. తన గదిలో ఫ్లోర్ ను శుభ్రంగా తుడిచారు.

అవసరమైనప్పుడు ఇలాంటి పనులు తప్పదని.. తనకు ఇవే కొత్త కాదని తెలిపారు మంత్రి లాల్ జిర్లియానా. తాను మంత్రినైనా.. ఇతరులకంటే ఎక్కువ అని తాను అనుకోవడం లేదన్నారు. అంతే కాదు తాను ఈ పని చేసి.. ఆసుపత్రి సిబ్బందిని ఇబ్బందికి గురిచేయాలని తీసుకున్న నిర్ణయం కాదన్నారు.

Tagged Corona Positive, Mizoram minister, R Lalzirliana, mops hospital floor

Latest Videos

Subscribe Now

More News