ఫర్టిలైజర్ ఓనర్ కు కరోనా పాజిటివ్

ఫర్టిలైజర్ ఓనర్ కు కరోనా పాజిటివ్
  • ఎరువులు, విత్తనాలు కొన్న రైతుల్లో ఆందోళన
  • పాజిటివ్ వ్యక్తి హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించిన ఆఫీసర్లు
  •  10 మంది ప్రైమరీ కాంటాక్టుల గుర్తింపు

 

జనాల్లో కరోనా టెన్షన్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో డెయిలీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎంత జెప్పినా చాలా మంది జాగ్రత్తలు తీసుకోవడంలేదు. దీంతో కరోనా బారిన పడుతున్నారు . మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్ లోని ఓ ఫర్టిలైజర్ షాపు ఓనర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని డీఎంహెచ్వో మహేందర్ ధ్రువీకరించారు. హై రిస్క్ కాంటాక్టులుగా ఉన్న బాధితుడి కుటుంబ సభ్యులు, షాపులో పనిచేసే వాళ్ళవి మొత్తం10 మంది శాంపిల్స్ టెస్టులకు పంపినట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని జనగామలోని ఇంట్లో హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. కాగా బాధితుడు హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు వెల్లాడు. పోలీసులు, మెడికల్ ఆఫీసర్లు షాపు మూసివేయించారు. అందులో పని చేసే వర్కర్లను , మిగతా ఓనర్లను హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు . షాపు ముందు శానిటైజ్ చేయించారు. 14 రోజుల పాటు ఓపెన్ చేయవద్దని ఆదేశించారు.

టెన్షన్.. టెన్షన్

కరోనా బాధితుడి షాపు జనగామలోనే అతిపెద్దది కావడంతో డెయిలీ వందలాది మంది రైతులతో కిక్కిరిసి పోయి ఉంటుంది. అలాగే గుమాస్తాలు, వివిధ కంపెనీలకు చెందిన నౌకర్లు, హమాలీలు మొత్తంగా సిబ్బందే 70 మందికి పైగా ఉంటారని అంటున్నారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు ఈ షాపుకు వచ్చి కొనుగోళ్లు చేస్తున్నందున రైతులు ఆందోళన చెందుతున్నారు .