రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సులోకి దూసుకెళ్లిన టిప్పర్.. డ్రైవర్లు ఇద్దరూ స్పాట్ డెడ్.. బస్సులో 70 మంది

రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సులోకి దూసుకెళ్లిన టిప్పర్.. డ్రైవర్లు ఇద్దరూ స్పాట్ డెడ్.. బస్సులో 70 మంది

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు దగ్గర సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొన్న ఘటన విషాదం నింపింది.

ఈ దుర్ఘటనలో బస్సులోకి టిప్పర్ దూసుకెళ్ళింది. టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్సు డ్రైవర్.. ఇద్దరూ మృతి చెందారు. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. టిప్పర్ దూసుకొచ్చిన తీవ్రతకు బస్సులోని సీట్లలో కొందరు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. టిప్పర్ కింద ఇరుక్కున్న బస్సులో ముందు ఐదు వరుసలో ఉన్న సీట్లు ఉన్నాయి. 

కంకర రాళ్ళతో బస్సు సగ భాగం నిండిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎంత మంది చనిపోయారనేది తెలియాల్సి ఉంది. బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీసే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

  • రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • బస్సును ఢీకొన్న కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ లారీ
  • 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
  • క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
  • బస్సులో 70 మంది ప్రయాణికులు
  • చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘటన
  • చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్