సుమతీ శతకం హీరో అమర్ దీప్ కు రవితేజ బెస్ట్ విషెస్ 

సుమతీ శతకం హీరో అమర్ దీప్ కు రవితేజ బెస్ట్ విషెస్ 

పలు సీరియల్స్‌‌తోపాటు ‘బిగ్‌‌బాస్‌‌’ షోతో  ఫేమ్ తెచ్చుకున్న అమర్‌‌‌‌దీప్ చౌదరి.. రవితేజకు పెద్ద ఫ్యాన్. దీంతో అమర్ హీరోగా నటించిన ‘సుమతీ శతకం’  చిత్రానికి సంబంధించిన కంటెంట్‌‌ను రవితేజ చూసి.. టీజర్, ట్రైలర్ బాగుందని, సినిమా పెద్ద విజయం సాధించాలని విషెస్  తెలియజేశాడు. 

ఎంఎం నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 6న  విడుదలవుతోన్న ఈ సినిమాను  మైత్రి మూవీ మేకర్స్ సంస్థ  డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  శైలి చౌదరి హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రంలో  టేస్టీ తేజ, మహేష్ విట్టా, జేడీవీ ప్రసాద్ ఇతర పాత్రలు పోషించారు.