చేవేళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. ఈ యాక్సిడెంట్ తర్వాత ఆయా కుటుంబాల్లో విషాధం వర్ణనాతీతం. ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి వ్యథ. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు.. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం.. చెల్లిని కోల్పోయిన అక్కడ.. తండ్రిని కోల్పోయిన కొడుకు.. తండ్రి, భార్య, కుమార్తెను కోల్పోయిన మరో కుటుంబం.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి విషాదం.
తాండూరుకు చెందిన అశోక్ అనే వ్యక్తి.. తన కుమారుడితో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరాడు. కుమారుడికి చెవి నొప్పిగా ఉండటంతో.. హైదరాబాద్ పెద్దాసుపత్రిలో చూపించాలని ఉదయం ఫస్ట్ బస్సుకే బయలుదేరాడు. కుమారుడితో కలిసి వస్తున్న ఆ తండ్రి.. బస్సు యాక్సిడెంట్ లో చనిపోయాడు. కొడుకు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
చేవేళ్ల ఆస్పత్రి దగ్గర ఆ కొడుకు, భార్య బాధ వర్ణనాతీతం. భర్తను కోల్పోయిన భార్య.. నాన్నను కోల్పోయిన ఆ బిడ్డ ఏడుస్తున్న తీరు అందర్నీ కన్నీళ్లు పెట్టించింది. నా ఆరోగ్యం కోసం వెళుతున్న సమయంలోనే ఇలా జరగటంతో ఆ కుమారుడు ఒకటే ఏడుస్తున్న తీరు అందర్నీ కలిచి వేసింది.
ఇంట్లో నుంచి బయలుదేరిన భర్త ఒక లేడని.. బస్సు ప్రమాదంలో చనిపోయాడని తెలిసి ఆ భార్య ఏడుస్తున్న ఆమెను ఓదార్చటం ఎవరితరం కాలేదు. ఆస్పత్రిలోని పోస్టుమార్టం గది దగ్గర.. ఆ తల్లీ బిడ్డా బాధలు అందర్నీ అయ్యోపాపం అనిపించింది.
