రవితేజ కెరీర్లో 75వ మైల్ స్టోన్ మూవీగా ‘మాస్ జతర’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాస్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ దగ్గర మిక్సెడ్ టాక్తో నడుస్తోంది. ఈ క్రమంలో సినిమాకు మేకర్స్ ఆశించనంత స్థాయి వసూళ్లు సాధించలేకపోతుంది. ప్రీమియర్స్తో కలుపుకుని ఇండియా బాక్సాఫీస్ దగ్గర మూడు రోజుల్లో రూ.9.51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే, ఈ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ ఎంత రాబట్టిందనేది మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. కేవలం, ప్రీమియర్స్ డే శుక్రవారం (అక్టోబర్ 31న) రూ.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు పోస్టర్ ప్రకటించారు. ఆ తర్వాత వసూళ్ల వివరాలు ప్రకటించకపోవడం గమనార్హం!!
ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం.. ఇండియాలో ‘మాస్ జతర’ మూవీ, ప్రీమియర్ రోజు (అక్టోబర్ 31న).. రూ.2.9 కోట్ల నెట్, ఫస్ట్ డే (శనివారం) రూ.3.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజైన ఆదివారం వసూళ్లు క్రమంగా తగ్గి రూ.2.64 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. ఈ క్రమంలో మాస్ జాతర మూడు రోజుల్లో రూ.9.51కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
మాస్ జాతర' అనేది రవితేజ అభిమానుల కోసం రూపొందించిన పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. రొటీన్ కథ-కథనాన్ని పక్కన పెడితే, రవితేజ ఎనర్జీ, మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులకు పండగలా అనిపిస్తాయి. కానీ, కొత్తదనం ఆశించే సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది ఇప్పటికే చాలాసార్లు చూసిన 'ఖాకీ కథ' లాగే అనిపిస్తుంది.
మొత్తానికి ఈ మూవీ రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్షకులకు పండగలాంటి సినిమా అని చెప్పవచ్చు. కానీ, బాక్సాఫీస్ పై నిలకడ లేకుండా పెర్ఫార్మన్స్ చూపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో చూడాలి.
BLOCKBUSTER JATHARA marches on! 🔥🔥#MassJathara had a superb 1st weekend at the box-office! 💥💥
— Sithara Entertainments (@SitharaEnts) November 3, 2025
In Cinemas Now - Book your tickets 🎟️ – https://t.co/jC2uc7EUSa
Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna… pic.twitter.com/WEOUrxUo1p
మార్పు కోరుకుంటున్న ఫ్యాన్స్:
‘ఖిలాడి’ నుంచి ‘ఈగల్’ వరకూ రవితేజ చేసిన ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ కథలన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. బాక్సాఫీస్ దగ్గర కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ సినిమాల్లో కథ, కథనం కోసం తీసుకున్న లైన్ మంచిగానే ఉన్నా.. పూర్తిస్థాయిలో కథపై దృష్టిపెట్టకపోవడం మైనస్ గా మారాయి. వీటిలో ఎక్కువగా బైకు సీన్స్, ట్రైయిన్స్ మీద ఛేజ్‌లు, మరికొన్నింట్లో గన్స్ పేల్చడంలో వెరైటీ పద్ధతులు, హీరోయిన్స్ తో రొమాంటిక్ సాంగ్స్.. ఇలా అన్నిటిలో ఒకే ఫార్మాట్ ఉంటున్నాయి.
ఈ క్రమంలో రవితేజ నుంచి వచ్చే ప్రతిసినిమా బాక్సాఫీస్ దగ్గర రెండ్రోజుల కంటే.. ఎక్కువగా నిలవట్లేదు. అయినా సరే, రవితేజ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ, రవితేజ మాత్రం సాలిడ్ హిట్ కొట్టే కథను ఎంచుకోలేకపోవడం గమనార్హం! ఎందుకంటే, కాస్త డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఆడియన్స్ చూస్తున్నారు.
కంటెంట్ లేకపోతే, రవితేజనే కాదు, ఏ స్టార్ హీరో సినిమా కూడా చూసే స్థాయిలో లేరు. కంటెంట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టి, మిగతా ఎంటర్ టైన్ మెంట్ విషయాలపై తక్కువ పెడితే.. సినిమా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
