ఆదివారం ( నవంబర్ 2 ) సాయంత్రం హైదరాబాద్ లో సడన్ గా వర్షం కురిసింది. అప్పటిదాకా పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లి, జీడిమెట్ల, పంజాగుట్ట, అమీర్ పేట్, బేగంపేట్ ఫిలిం నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సాయంత్రం సమయంలో వర్షం కురవడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కుత్బుల్లాపూర్, సుచిత్ర, గండిమైసమ్మ, బహదూర్ పల్లి, సూరారం, షాపూర్ నగర్, చింతల్, ఐడీపీఎల్, గాజులరామారం పరిసర ప్రాంతాల్లో క్కూడా వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శేరిలింగంపల్లి పరిధిలోని .. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది.
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలైన రానిగంజ్, ప్యారాడేజ్, క్లాక్ టవర్, సీతాఫల్ మండి, మెట్టుగూడ, అడ్డగుట్ట, మారేడుపల్లి, బోయిన్ పల్లి తోపాటు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఇదిలా ఉండగా.. రాత్రి 9 గంటల దాకా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించింది వాతావరణ శాఖ
