ఇండియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ చెలరేగి ఆడాడు. ఆకాశమే హద్దుగా ఆదివారం (నవంబర్ 2) హోబర్ట్ వేదికగా బెల్లెరివ్ ఓవల్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్ లోకి దిగిన దగ్గర నుంచి దూకుడుగా ఆడుతున్న టిమ్ డేవిడ్ ఒక భారీ సిక్సర్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఏకంగా 129 మీటర్ల సిక్సర్ కొట్టి అబ్బురపరిచారు.
అక్షర్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ఐదో బంతికి డేవిడ్ స్ట్రయిట్ సిక్సర్ బలంగా కొట్టాడు. టైమింగ్ కుదరడంతో పాటు బలంగా తగలడంతో బంతి ఏకంగా స్టేడియం టాప్ కు తగిలి కింద పడింది. 129 మీటర్ల దూరంలో పోయి పడిన ఈ సిక్సర్ కు డేవిడ్ కూడా షాకయ్యాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోయినా డేవిడ్ కొట్టిన సిక్సర్ హైలెట్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ సిక్సర్ నమోదవమడం ఇదే తొలిసారి. 100 మీటర్ల సిక్సర్ కొడితేనే ఔరా అనుకునే క్రికెట్ ఫ్యాన్స్ కు డేవిడ్ 129 మీటర్ల సాలిడ్ సిక్సర్ ప్రేక్షకులకు ఇచ్చాడు.
►ALSO READ | World Cup 2025 Final: చిరకాలం గుర్తుండే ఇన్నింగ్స్.. జట్టు కోసం శతకం చేజార్చుకున్న షెఫాలీ
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం (నవంబర్ 2) హోబర్ట్ వేదికగా బెల్లెరివ్ ఓవల్ లో జరిగిన హాయ్ స్కోరింగ్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆతిధ్య ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. భారీ ఛేజింగ్ లో వాషింగ్ టన్ సుందర్ (23 బంతుల్లో 49: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత క్యామియోతో పాటు మిగిలిన టీమిండియా బ్యాటర్లు తలో చేయి వేసి జట్టుకు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ లో ఇండియా 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి గెలిచింది.
Tim David just launched an absolute monster, a record breaking 129m six, the longest in T20 history! 🤯🔥🥶pic.twitter.com/uTRHjYynG8
— Athul M Nair (@athulmnair1) November 2, 2025
