జైపూర్: రాజస్తాన్లోని జైపూర్‌లో విషాద ఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న బాలిక శనివారం మధ్యాహ్నం ఆ స్కూల్ ఫోర్త్ ఫ్లోర్ పై నుంచి దూకేసింది. ఈ దుర్ఘటనలో బాలిక తలకు తీవ్ర గాయం కావడంతో తీవ్ర రక్త స్రావం జరిగి స్పాట్లోనే చనిపోయింది. ఇంత జరుగుతుంటే పాఠశాల యాజమాన్యం ఏం చేస్తుందని బాలిక తల్లిదండ్రులు స్కూల్లో నిరసన చేశారు.
యాజమాన్యంతో గొడవ పడ్డారు. ఆ బాలిక గోడపైకి ఎక్కడం, కిందకు దూకేయడం ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. దాదాపు 47 అడుగుల పై నుంచి బాలిక కిందకు దూకేసింది. ఆ బాలిక రైలింగ్ ఎక్కుతున్నా ఏం పట్టనట్టు తోటి విద్యార్థులు మెట్లు దిగుతూ కనిపించారు.
ఈ ఘటన జరిగిన తీరు చూస్తుంటే.. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనప్పటికీ కారణం ఏంటనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. స్కూల్ యాజమాన్యం తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
►ALSO READ | కాలేజ్ మానేశారు.. కానీ ప్రపంచంలోనే అతి చిన్న వయసులో కోటీశ్వరులు ఆయిన స్కూల్ ఫ్రెండ్స్...
బాలిక పై నుంచి దూకేసిన అనంతరం హాస్పిటల్కు తరలించిన కొద్దిసేపటికే స్పాట్లో రక్తపు మరకలను తుడిచేసి, ఫ్లోర్ ను కడిగేసి అక్కడ అసలు ఏం జరగనట్లు స్కూల్ యాజమాన్యం ప్రవర్తించిన తీరు అనుమానాలకు కారణమైంది. సాక్ష్యాలను చెరిపేసేందుకు స్కూల్ యాజమాన్యం ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బాలిక పేరు అమైరా. స్కూల్ పేరు నీర్జా మోదీ స్కూల్. శనివారం మధ్యాహ్నం 12.30 సమయంలో ఈ ఘటన జరిగింది.
जयपुर
— Akirti Panwar (@Akirtithakur) November 2, 2025
नीरजा मोदी स्कूल में छात्रा अमायरा मौत मामले में cctv video आया सामने @DcDmJaipur pic.twitter.com/EqnmsYh7dn
