ప్రపంచ వ్యాప్తంగా 59 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 59 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.  ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,09,677కు చేరగా..కరోనా మృతుల సంఖ్య 3,62,102 కు చేరింది.  25,83,004 మంది కరోనా నుంచి కోలుకోగా మరో 29,64,571 మంది చికిత్స తీసుకుంటున్నారు.

17,68,461 కరోనా కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా..4,38,812 కేసులతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఆ తర్వాతి స్థానాల్లో 3,79,051 కేసులతో రష్యా,2,84,986 కేసులతో స్పెయిన్,2,69127 కేసులతో యూకే, 2,31,732 కేసులతో ఇటలీ, 1,86,238 కేసులతో ఫ్రాన్స్, 1,82,452 కేసులతో జర్మనీ,  1,65,799 కేసులతో భారత్, 1,60,979 కేసులతో టర్కీ  ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 3,62,102 మంది కరోనాతో చనిపోగా.. ఇందులో 1,03,330 మంది  మృతులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. ఆతర్వాత యూకేలో 37,837,ఇటలీ 33,142, ఫ్రాన్స్ లో 28,662 మంది, స్పెయిన్ లో 27,119, బ్రెజిల్ లో 26,764, బెల్జీలియంలో 9,388, మెక్సికోలో 9,044, జెర్మనీలో 8,570, ఇరాన్ లో 7,627,కెనడాలో 6,877, నెదర్లాండ్ లో 5,903 ఇండియాలో 4,711,టర్కీలో 4,461 ,రష్యాలో4,142 మంది చనిపోయారు.