50 ఏళ్లు దాటితే.. గండమే

50 ఏళ్లు దాటితే.. గండమే

హార్ట్ డిసీజ్, కేన్సర్‌‌‌‌‌‌‌‌, లంగ్స్‌‌‌‌, కిడ్నీ ప్రాబ్లమ్​, డయాబెటిస్​ ఉన్నోళ్లకు హైరిస్క్

కరోనా మృతుల్లో 70 శాతం వాళ్లే 

రాష్ట్రంలో 412 మంది వృద్ధులకు వైరస్

మృతుల్లో 84 మంది 50 ఏళ్లు దాటినవారే

దేశంతో పోలిస్తే రాష్ట్రంలోనే డెత్​ రేట్​ ఎక్కువ

టెస్టులపై నిర్లక్ష్యం వల్లనే..

హైదరాబాద్‌, వెలుగు: ఇప్పటికే ఏవైనా హెల్త్​ ప్రాబ్లమ్స్​తో బాధపడుతున్న వాళ్లకు కరోనా ప్రాణగండంగా మారింది. ముఖ్యంగా హార్ట్ డిసీజ్, కేన్సర్‌‌, లంగ్స్‌, కిడ్నీ ఫెయిల్యూర్, డయాబెటిస్‌ వంటి వాటితో బాధపడే వాళ్లకు ప్రమాదం పొంచి ఉంది. ఇందులోనూ 50 ఏండ్లు దాటినవాళ్లే ఎక్కువగా మరణిస్తున్నారని, రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వాళ్లలో 70 శాతం మంది అలాంటి వారేనని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం వరకు మొత్తంగా 3,290 పాజిటివ్​ కేసులు నమోదుకాగా.. 113 మంది చనిపోయారు. వీరిలో గత పది రోజుల్లోనే మృతిచెందినవాళ్లే 56 మంది.

ప్రతి 100 మందిలో 14 మంది డెత్

కరోనా సోకిన ప్రతి వంద మంది వృద్ధుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ ఒకటో తేదీ నాటికి హెల్త్​ డిపార్ట్​మెంట్​ వెల్లడించిన లెక్కల ప్రకారం.. మొత్తం 113 మంది మృతుల్లో 59 మంది 60 ఏండ్లు దాటిన వాళ్లే. 50 నుంచి 59 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లు 25 మంది ఉన్నారు. అంటే చనిపోయినవాళ్లలో 75% మంది 50 ఏండ్లు దాటిన వాళ్లే. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం, వివిధ హెల్త్​ సమస్యలతో బాధపడుతుండడమే సీనియర్ సిటిజన్లలో డెత్‌ రేట్ ఎక్కువగా ఉండడానికి కారణమని డాక్టర్లు చెప్తున్నారు. అటు దేశవ్యాప్తంగా చూసినా కరోనా మరణాల్లోనూ దాదాపు సగం మంది వృద్ధులవే ఉంటున్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా మొత్తం 412 మంది వృద్ధులు వైరస్ బారిన పడ్డారు.

ఇమ్యూనిటీ తక్కువగా ఉండి..

వయసు పెరిగిన కొద్దీ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని, అందుకే హెల్త్ కండిషన్ క్రిటికల్​గా మారుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లలో వైరస్​ ప్రభావం ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాలపై పడుతుందని.. దీంతో ప్రమాదం ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. వైరస్ లక్షణాలు కనిపించిన నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతున్నారని చెప్తున్నారు. వృద్ధులు, మధ్య వయసు వాళ్ల తర్వాత చిన్న పిల్లల్లో కూడా కరోనా ఎఫెక్ట్​ ఉంటోంది. రాష్ట్రంలో పదేండ్ల లోపు పిల్లల్లో 228 మందికి కరోనా సోకగా.. ఆరుగురు చనిపోయారు. ఈ ఆరుగురూ రెండేండ్ల లోపు వయసు వాళ్లే. అందువల్ల పిల్లలు, వృద్ధులు కరోనా సోకకుండా అలర్ట్​గా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మరణాలు తగ్గించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సర్కారు చెబుతున్నా.. మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో ఎక్కువ డెత్స్ నమోదవుతున్నాయి. దేశంలో డెత్ రేట్​2.8 శాతం ఉండగా.. రాష్ట్రంలో 3.43 శాతంగా ఉంది.

For More News..

బార్లు, పబ్‌‌లు ఓపెన్‌ ?