తెలంగాణ జిల్లాలకు కరోనా రిస్క్ ఎక్కువ

తెలంగాణ జిల్లాలకు కరోనా రిస్క్ ఎక్కువ

న్యూఢిల్లీ: దేశంలో మధ్యప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లోని జిల్లాలకు కరోనా మహమ్మారి ముప్పు చాలా ఎక్కువగా ఉందని రీసెర్చర్లు వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో మెడికల్ ఫెసిలిటీలు మెరుగవ్వకపోతే కేసులు, మరణాల రేటు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలోని 9 పెద్ద రాష్ట్రాల్లో తాము జరిపిన  స్టడీలో ఈ విషయాలను అంచనా వేసినట్లు ఢిల్లీలోని పాపులేషన్ కౌన్సిల్ కు చెందిన సైంటిస్ట్ రాజీబ్ ఆచార్య వెల్లడించారు. బ్రిటన్ కు చెందిన ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో ఈ స్టడీ వివరాలు పబ్లిష్ అయ్యాయి.

మధ్యప్రదేశ్ కు మోస్ట్ ఎఫెక్ట్..

ఆయా రాష్ట్రాల్లోని జిల్లాల్లో సోషియోఎకనమిక్, డెమోగ్రాఫిక్, హౌసింగ్, హైజీన్, ఎపీడెమియోలజికల్, హెల్త్ సిస్టం అనే ఐదు రంగాల్లో 15 ఇండికేటర్స్ ఆధారంగా ఈ స్టడీ  జరిపారు. ఆయా రాష్ట్రాలకు జీరో నుంచి 1 వరకు స్కోరును కేటాయించారు. దీనిలో మధ్యప్రదేశ్ అత్యధికంగా 1 స్కోరును పొందింది. అన్నింటికంటే ఎక్కువగా మధ్యప్రదేశ్ లోని జిల్లాలకు కరోనా రిస్క్ ఎక్కువగా ఉండగా, ఆ తర్వాత తెలంగాణ, బీహార్ జిల్లాలకు ముప్పు అధికంగా ఉందని స్టడీలో తేలింది. వీటి తర్వాత జార్ఖండ్, యూపీ, మహారాష్ట్ర, బెంగాల్, ఒడిశా, గుజరాత్ జిల్లాలపైనా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

నార్త్​ఈస్ట్​ రాష్ట్రాలకు తక్కువ రిస్క్…

నార్త్​ఈస్ట్​ రాష్ట్రాల్లో కరోనా రిస్క్ చాలా తక్కువగా ఉందని రీసెర్చర్లు వెల్లడించారు. సిక్కిం జీరో స్కోరుతో ఇండెక్స్ లో అన్నింటికంటే కింద నిలిచి, సురక్షిత రాష్ట్రంగా ఉందని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా రిస్క్ చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది.  మొత్తంగా కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న 100 జిల్లాల్లో యూపీలో 33, బీహార్ లో 24, మధ్యప్రదేశ్ లో 20 జిల్లాలు ఉన్నాయి. ప్రధానంగా ఆరోగ్య సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని రీసెర్చర్లు హెచ్చరించారు.

మరింత డేటా సేకరించాలి.. 

కరోనా ఇన్ఫెక్షన్, వ్యాప్తి, మరణాల రేటు, దాని వల్ల కలిగే సామాజిక, ఆర్థిక ప్రభావాలను ఈ రీసెర్చ్ లో అంచనా వేసినట్లు రాజీబ్ ఆచార్య వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో వనరులను మెరుగుపర్చుకునేందుకు, ముందస్తు సన్నాహాలు చేసుకునేందుకు, కరోనా విపత్తును బాగా ఎదుర్కొనేందుకు తమ రీసెర్చ్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కరోనా కేసులు మరీ ఎక్కువగా లేకున్నా, మున్ముందు వాటిపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని స్టడీలో తేలిందన్నారు.  రెండు నుంచి ఐదేళ్లలోపు పిల్లల డేటాను ఈ స్టడీలో ఉపయోగించామని, కరోనా పరిస్థితి వేగంగా మారిపోతున్న జిల్లాల్లోని ఇతర అంశాలను స్టడీలో పరిశీలించలేదని చెప్పారు. ప్రాంతీయ స్థాయిలో మరింత డేటాను సేకరిస్తే, కరోనా ముప్పును బాగా అంచనా వేయొచ్చని ఆయన సూచించారు.

పరిస్థితి మరీ అంత భయంకరంగా లేదు