దేశంలో కరోనా సెకండ్​వేవ్​ రాదు

V6 Velugu Posted on Dec 20, 2020

వచ్చినా ఫస్ట్​వేవ్​ కన్నాసీరియస్​గా ఏమీ ఉండదు

కరోనాపై హెల్త్​ఎక్స్​పర్ట్స్​ అభిప్రాయం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ వచ్చే అవకాశం లేదని హెల్త్​ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఒకవేళ వచ్చినా ఫస్ట్​వేవ్​లో ఉన్నంత సీరియస్​గా మాత్రం ఉండదని అంటున్నారు. కరోనా కేసులు, మరణాలు చాలా వరకు తగ్గుముఖం పడుతున్నాయంటున్నారు. సెప్టెంబర్​ మధ్య నుంచి రోజువారీ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయని ప్రముఖ వైరాలజిస్ట్​ డాక్టర్​ షాహీద్​ జమీల్​ అన్నారు. ‘‘సెప్టెంబర్​ మొదట్లో రోజూ 93 వేలకుపైగా కరోనా కేసులు వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య సగటున 25,500కు తగ్గింది. నాకు తెలిసి గడ్డు రోజులు పోయాయి. అయితే, నవంబర్​లో వచ్చినట్టు కొద్దిగా తీవ్రత పెరిగే అవకాశం లేకపోలేదు’’ అని ఆయన అన్నారు. ఇప్పటికే దసరా, దీపావళి లాంటి పెద్ద పండుగలు అయిపోయాయని, రాష్ట్రాల్లో ఎన్నికలూ పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఆ టైంలో కరోనా కేసులు పెద్దగా పెరగలేదన్నారు. రెండో సీరో సర్వే నాటికే అధికారికంగా ప్రకటించిన కేసుల కన్నా 16 రెట్లు ఎక్కువ కేసులు ఉన్నట్టు తేలిందని, ఆ లెక్కన అప్పటికే కోటీ 60 లక్షల మందికి కరోనా వచ్చి ఉంటుందని చెప్పారు. ఆ లెక్క ప్రకారం ఇప్పటికే 30 కోట్ల నుంచి 40 కోట్ల మందికి కరోనా సోకి ఉండే అవకాశాలున్నాయని వివరించారు. చాలా పెద్ద సంఖ్యలో హెర్డ్​ ఇమ్యూనిటీ వచ్చినట్టేనని చెప్పారు.

అంత స్పీడ్​ ఉండదు

సెకండ్​ వేవ్​ వచ్చినా ఫస్ట్​వేవ్​తో పోలిస్తే కేసులు అంత స్పీడ్​గా పెరగవని ప్రముఖ సైంటిస్ట్​ గగన్​దీప్​ కంగ్​ అన్నారు. ఇప్పటికే కరోనా చాలా మందికి సోకిందని, భవిష్యత్తులో మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి ఆ మాత్రం వ్యాప్తి సరిపోతుందని ఆమె చెప్పారు. దేశంలో ఇంకో 40 శాతం మందికి కరోనా సోకలేదని కార్డియాలజిస్ట్​ డాక్టర్​ కేకే అగర్వాల్​ చెప్పారు.

టెస్టులు 16 కోట్లు దాటినయ్‌‌‌‌

దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 16 కోట్లకు పెరిగింది. గడిచిన 24 గంటల్లో చేసిన 11 లక్షల టెస్టులతో కలిపి ఇప్పటివరకు 16 కోట్ల 90 వేల 514 శాంపిల్స్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చేశామని సెంట్రల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ మినిస్ట్రీ శనివారం వెల్లడించింది. టెస్టులు ఎక్కువగా చేయడం వల్ల పాజిటివ్‌‌‌‌ రేట్‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌ చేయగలిగామని చెప్పింది. ప్రస్తుతానికి పాజిటివ్‌‌‌‌ కేసుల సంఖ్య 6.25 శాతం ఉందని, టెస్టింగ్‌‌‌‌ కెపాసిటీ 15 లక్షలకు పెరిగిందని తెలిపింది. కాగా, గడిచిన నెల రోజుల్లో పది లక్షల కేసులు నమోదు కాగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటికి పెరిగింది. అలాగే వైరస్‌‌‌‌ బారినుంచి 95.50 శాతం మంది రికవర్‌‌‌‌‌‌‌‌ అవుతున్నారని, 24 గంటల్లో డైలీ రికవరీల రేటు కూడా పెరిగిందని చెప్పింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 347 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య లక్షా 45 వేల 136కు చేరుకుంది.

For More News..

వర్క్ ఫ్రమ్ హోమ్‌తో తగ్గిన ఇంటి కిరాయిలు

16 ఏండ్ల బాలికతో క్షుద్రపూజలు?

దండకారణ్యంలో ఓపెన్​ క్లబ్బులు.. అక్కడ కోడి పంచాంగం స్పెషల్

Tagged health experts, India, coronavirus, corona second wave

Latest Videos

Subscribe Now

More News