ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టుకు రూ.2200

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టుకు రూ.2200

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పెరుగుతున్న కేసులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందరికి వైద్యం అందించడం ఇబ్బందికరంగా మారింది. సమస్య తీవ్రతరం కాకముందే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రైవేట్ ల్యాబ్ ల్లో కరోనా పరీక్షల ఫీజులపై చర్చించారు.

ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా టెస్టులకు సంబంధించిన ధరలను తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. ప్రైవేట్  ఆస్పత్రిలో కరోనా టెస్టులకు రూ.2,200లు గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వెంటిలేటర్ పై  ఉంటే రోజుకు 9వేల రూపాయల చార్జ్ వేయాలన్నారు. వెంటిలేటర్ లేకుండా చికిత్స చేస్తే రోజుకు 7,500 ఫీజు ఉంటుందన్నారు. పాజిటివ్ ఉండి ఐసోలేషన్ లో ఉంటే రోజుకు 4 వేలు తీసుకోవాలన్నారు. యాంటీ డ్రగ్స్ కు ప్రత్యేక చార్జీలు వేసేలా నిబంధనలు రూపొందించారు. అంతేకాదు కరోనా టెస్టులు, పాజిటివ్ వివరాలు పోర్టల్ లో నమోదు చేయాలన్నారు మంత్రి.

ఈ టెస్టులన్నీ డాక్టర్ సలహా ప్రకారమే టెస్టులు చేయాలన్నారు ఈటల. లక్షణాలు లేకపోతే టెస్టులు చేయవద్దన్నారు. రోజుకు 3,500 మందికి టెస్టులు చేయవచ్చన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. టెస్టులు చేయడం లేదనడం అబద్ధమని చెప్పారు.