తెలంగాణలో ‘కోటి’ దాటిన కరోనా టెస్టులు

తెలంగాణలో ‘కోటి’ దాటిన కరోనా టెస్టులు
  • వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి

హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రంలో గత మార్చి నుంచి ఇప్పటివరకు కరోనా పరీక్షలు ఇవాళ్టితో కోటి దాటిపోయాయి... కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నా కరోనా వ్యాప్తి అదుపులోని ఉంది.. భయపడాల్సిన పరిస్థితి లేదు..’’ అని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.  కరోనాను ఎదుర్కోవడంలో కృషి చేస్తున్న పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారందరికీ ఆయన ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు పాజిటివిటీ రేట్ 0.6 శాతం నమోదైంది. ప్రస్తుత మార్చి నెలలో 12 లక్షల 40 వేల పరీక్షలు చేశాము.. టెస్టింగ్ సంఖ్య విపరీతంగా పెంచేశాము.. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకున్నాము. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగినా కూడా రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండటంతో కొంత కట్టడి అయ్యాయి..’’ అని ఆయన వివరించారు. 

సెకండ్ వేవ్ మొదలైంది.. జాగ్రత్తలు పాటించాలి

‘‘కరోనా ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలైంది.. ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దు.. సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం), శానిటైజేషన్ తప్పనిసరిగా పాటించాలి.. ’’ అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరారు. వాక్సినేషన్ మొదలైనా.. ప్రజల నుంచి స్పందన తక్కువగా ఉంది.. ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాలు పైబడిన వాళ్లందరికీ వాక్సిన్ ఇవ్వబోతున్నాము..2 డోసులు వాక్సిన్ తీసుకున్న 80 ఏళ్ల వ్యక్తికి మళ్లీ కోవిడ్ వచ్చింది.. కానీ చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి.. లంగ్స్ మాత్రం పూర్తిగా క్లియర్ గా ఉన్నాయని వైద్యులు చెప్పారు. మన రాష్ట్రానికి 24 లక్షల 49 వేల 330 వాక్సిన్ డోసులు వచ్చాయి..12 లక్షల వాక్సిన్లు వేశాము.  హొలీ పండగ సామూహికంగా జరుపుకునే పండుగ... కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. వరుసగా వస్తున్న పండగలతో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.. అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు.