బయటి నుంచి వచ్చేటోళ్లకు పూల్‌‌ టెస్టులు

బయటి నుంచి వచ్చేటోళ్లకు  పూల్‌‌ టెస్టులు

హైదరాబాద్‌‌, వెలుగు: ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి సొంతూర్లకు వస్తున్న వాళ్లకు పూలింగ్‌‌ మెథడ్‌‌లో కరోనా టెస్టులు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. 21 రోజులగా కేసులు నమోదవని గ్రీన్‌‌ జోన్‌‌ జిల్లాల్లోనూ పర్యవేక్షణ కోసం ఇదే టెస్టింగ్‌‌ పద్ధతిని వాడాలని చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు గురువారం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం వేరే దేశాల నుంచి రాష్ర్టానికి వస్తున్న వారిలో వైరస్ లక్షణాలున్న వాళ్లను దవాఖాన్లకు తరలించి టెస్టులు చేయిస్తున్నారు. లక్షణాల్లేని వాళ్లను హోటళ్లలో క్వారంటైన్‌‌ చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న వాళ్లను రాష్ట్ర బార్డర్లలో స్ర్కీనింగ్ చేసి లక్షణాలు ఉంటే దవాఖాన్లకు, లేకుంటే హోమ్‌‌ క్వారంటైన్‌‌కు పంపిస్తున్నారు. ఇంట్లో క్వారంటైన్‌‌లో ఉండేందుకు సౌకర్యం లేని వాళ్లను ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉంచుతున్నారు. క్వారంటైన్ సెంటర్లు, హోటళ్లలో ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్లలో ఒక్కరికి వైరస్ ఉన్నా ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ సూచనలు చేసింది.

5 శాంపిళ్లు కలిపి చేస్తే పూలింగ్‌‌

ఆర్టీ పీసీఆర్ పద్ధతిలో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది శాంపిళ్లను కలిపి ఒకే పరీక్షగా చేస్తే పూలింగ్‌‌గా పిలుస్తారు. ఈ పద్ధతిలో తక్కువ ఖర్చులో ఎక్కువ మందికి టెస్టులు చేయొచ్చు. మన దగ్గర సీసీఎంబీలో ఈ తరహా టెస్టులే చేస్తున్నారు.  తాజాగా 25 శాంపిళ్లను కలిపి ఒకే టెస్టుగా చేసుకోవడానికి ఐసీఎంఆర్‌‌ అనుమతిచ్చింది. టెస్టులో నెగెటివ్ వస్తే ఆ పూల్‌‌లోని 25 మందికీ నెగెటివ్‌‌ ఉన్నట్టు తేలిపోతుంది. పాజిటివ్‌‌ వస్తే విడివిడిగా టెస్టులు చేస్తారు.

ఏపీ ప్రభుత్వానిది జలదోపిడి