కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల ధ‌ర‌లను తగ్గిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల ధ‌ర‌లను తగ్గిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ప్రైవేట్ ల్యాబ్ ల‌లోని కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల ధ‌ర‌లను త‌గ్గిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనాతో భయపడుతూ ఆస్పత్రులకు వెళ్తే.. ఫీజుల రూపంలో దండుకుంటున్నారని ప్రజలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ‌తంలో రూ.2,900గా ఉన్న స్వాబ్ టెస్ట్ ధ‌ర‌ను రూ. 1,900కు త‌గ్గించింది. అదేవిధంగా.. ప్ర‌భుత్వం పంపించే శాంపిల్స్ టెస్టింగ్ ధ‌రను రూ. 2,400 నుంచి రూ. 1,600కు త‌గ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క‌రోనా నిర్ధార‌ణ కిట్ ల త‌యారీ పెర‌గ‌డంతో.. ధ‌ర‌లు త‌గ్గించాలని ప్ర‌భుత్వం భావించింది. ఎక్కువ‌మంది అనుమానితుల‌కు కరోనా ప‌రీక్ష‌లు అందుబాటులో ఉండాల‌ంటే.. పరీక్షల ధరలు త‌గ్గించడమే మార్గమని ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేట్ ల్యాబ్ లలో ఇవే ధరలు అమలయ్యేలా చూడాలని అన్ని జిల్లాల వైద్యారోగ్య‌శాఖాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

For More News..

వర్షాలకు హైదరాబాద్ లో కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ సీఈఓ

నా కొడుకుకు రియా విషం పెట్టి చంపింది.. సుశాంత్ తండ్రి సెల్ఫీ వీడియో