రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్.. తెలంగాణలో సెంటర్లు ఇవే

రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్.. తెలంగాణలో సెంటర్లు ఇవే

గత నెలన్నరగా వ్యాక్సిన్ ప్రణాళికలు రూపొందిచినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు. ఇప్పటి వరకు 3లక్షల 84 వేల డోసులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రైమరీ సెంటర్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు 50 వేళ మంది కొన్ని వారాల్లో  కరోనా వ్యాక్సిన్ తీసుకుంటారన్నారు.  దేశ వ్యాప్తంగా 3 వేలకు పైగా వ్యాక్సినేషన్  సెంటర్స్ ఏర్పాటు చేయగా…రాష్ట్రంలో 139 సెంటర్స్ ఉన్నాయన్నారు. రేపు నుంచి ప్రారంభమయ్యే కరోనా వ్యాక్సిన్ పంపిణీలో 4వేళ మంది వ్యాక్సిన్ తీసుకుంటారని చెప్పారు. ప్రతి సెంటర్ లో 30 మందికి ఇస్తామన్నారు. సోమవారం 2 వందల సెంటర్స్… మంగళవారం 5 వందలు.. ఇలా పెంచుకుంటూ ముందుకు వెళతామన్నారు. 1213 సెంటర్స్ లో దశల వారిగా ప్రారంభిస్తామన్నారు. వ్యాక్సినేషన్ ను  గాంధీ ఆస్పత్రిలో మంత్రి ఈటల,  నిమ్స్ లో గవర్నర్ ప్రారంభించనున్నారు.

దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ ఉదయం 10.30 కి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు. ప్రధానితో రెండు సెంటర్లు ఇంటరాక్ట్ కానున్నాయి. ఇప్పటి వరకు 3 లక్షల 15 వేల మంది కోవిన్ లో ఇజిస్టర్ చేసుకున్నారు.

రాష్ట్రంలో వాక్సినేషన్ సెంటర్స్ ఇవే..

1.గాంధీ ఆస్పత్రి, 2.నార్సింగి PHC, 3.ఆదిలాబాద్ (3), 4.భద్రాద్రి కొత్తగూడెం(4), 5. హైదరాబాద్(12), 6. జగిత్యాల(2), 7. జనగామ(2), 8.జయశంకర్ భూపాలపల్లి(3), 9.జోగులంబా గద్వాల్(4), 10.కామారెడ్డి(4), 11.కరీంనగర్(4), 12.ఖమ్మం (6), 13.కొమరం భీం అసిఫాబాద్ (3), 14.మహబూబాబాద్(4), 15.మహబూబ్ నగర్(4), 15.మంచిర్యాల (2), 16.మెదక్(2), 17.మేడ్చల్ (11), 18.ములుగు(2), 19.నాగర్ కర్నూలు(2), 20.నల్గొండ(3), 21.నారాయణ్ పేట్(3), 22.నిర్మల్ (3), 23.నిజామాబాద్(6), 24.పెద్దపల్లి( 4), 25. రాజన్న సిరిసిల్లా(4), 26.రంగారెడ్డి(9), 27.సంగారెడ్డి(6), 28.సిద్దిపేట(3), 29.సూర్యాపేట( 3), 30.వికారాబాద్(3), 31.వనపర్తి(4), 32.వరంగల్ రూరల్(4), 33.వరంగల్ అర్బన్( 6), 34.యాదాద్రి భువనగిరి(3).