వాటర్ బాటిల్ కన్నా తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్

వాటర్ బాటిల్ కన్నా తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్

మంచినీళ్ల బాటిల్ ధర కన్నా తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. వ్యాక్సిన్ నాణ్యత విషయంలో రాజీపడేది లేదని అన్నారు. ప్రపంచ దేశాలన్నింటికీ భారత్లో ఇచ్చినట్టుగానే వ్యాక్సిన్ ఇస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించారు. డాక్టర్ కృష్ణాఎల్లా, సుచిత్రా ఎల్లాతెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ఫార్ ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ తో కలిసి సంస్థ ఉద్యోగులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లా కృష్ణ మాట్లాడారు. కరోనా కొత్త వైరస్ కావడంతో అనేక సవాళ్లు ఎదురవుతున్నా యని, అయినా వ్యాక్సిన్ ను సక్సెస్ ఫుల్ గా తయారు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తో పాటు అమెరికా కూడా సాయం చేస్తోందన్నారు. భారత్లో తయారయ్యే వ్యాక్సిన్లలో 70 శాతం వరకు హైదరాబాద్ కు చెందిన 3 కంపెనీలే తయారు చేస్తున్నాయన్నారు.

భారత్ బయోటెక్ నుంచే ఫస్ట్ టీకా: కేటీఆర్

తెలంగాణ నుంచే కరోనా వైర‌‌స్‌‌కు తొలి టీకా వ‌‌స్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్ బయోటెక్ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఎక్కువన్నారు. క‌‌రోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉండడం గర్వంగా ఉందన్న ముందంజంలో ఉండ‌‌డం గర్వంగా ఉందన్నారు. టీకాల అభివృద్ధి, తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్అవసరాల దృష్ట్యా హైదరాబాద్ ధాన్యం కూడా పెరిగిందని అన్నారు. హైదరాబాద్ నుంచి మూడవ వంత వ్యాక్సిన్ ప్రపంచ దేశాల‌‌కు అందించడం గర్వంగా ఉంద‌‌న్నారు. ఈ చర్చా కార్యక్రమంలో బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎండీ మహిమ దాట్ల, ఇండియన్ ఇమ్యూనోలాజిక ల్స్ ఎండీ డాక్టర్ ఆనంద్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ పాల్గొన్నారు