కళ్ళ అద్దాలతో కూడా కరోనా వైరస్

కళ్ళ అద్దాలతో కూడా కరోనా వైరస్

కళ్ళ అద్దాల పై  కరోనా  వైరస్‌ 9 రోజుల వరకు ఉంటుం‌దని, బయ‌టకు వెళ్లి వచ్చి‌న‌ప్పుడు వాటిని కచ్చి‌తంగా శుభ్రం చేయా‌లని వైద్య నిపు‌ణులు చెబుతున్నారు. మా‌స్కు‌లతో నోరు, ముక్కును కవర్‌ చేసు‌కున్న‌ట్లుగానే కళ్లను కవర్‌ చేయ‌డా‌నికి అద్దాలు అంతే అవ‌సరం. అయితే కళ్ల అద్దాలతో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలుపుతున్నారు డాక్టర్లు. అంతేకాదు అద్దాలపై వైరస్‌ 9 రోజుల వరకు ఉంటుం‌దని పరి‌శో‌ధ‌నల్లో తేలిందన్నారు. అందుకే వాటిని ఎప్పుడూ శుభ్రం చేసు‌కో‌వాలని హైద‌రా‌బాద్‌ ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి ఐ స్పెషలిస్టు అక్షయ్‌ చెప్పారు. అయితే అద్దాలను ఆల్క‌హాల్‌ శాని‌టై‌జ‌ర్లతో శుభ్రం చేయ‌వ‌ద్దని..హైడ్రో‌జన్‌ పెరా‌క్సైడ్‌ వాడితే మంచి‌దని సూచిం‌చారు.