కరోనా పుట్టిన వుహాన్ సిటీలో…  వేల మందితో వాటర్‌‌ పార్టీ

కరోనా పుట్టిన వుహాన్ సిటీలో…  వేల మందితో వాటర్‌‌ పార్టీ

ఒక్క చోట వేల మంది.. అంతా దగ్గరగా, ఎట్లాంటి మాస్కులు లేకుండా ఎంజాయ్ చేస్తున్న ఈ ఫోటో ఎక్కడిదో తెలుసా? ఏ ఇంగ్లిషు కంట్రీ బీచ్ లో తీసిందో, ఏదో పాత ఫొటోనో కాదు. కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా వుహాన్​ సిటీలోని మాయ బీచ్ వాటర్ పార్క్ లో ఆదివారం జరిగిన మ్యూజిక్ పార్టీ ఇది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతుంటే.. వుహాన్​ సిటీలో మాత్రం అన్ని ఆంక్షలు ఎత్తేయడంతో జనం రిలాక్స్ అవుతున్నారు . గత ఏడాది డిసెంబర్ లో ఈ వుహాన్​ సిటీలోనే కరోనా వైరస్ తొలిసారిగా మనుషులకు సోకింది. అక్కడి నుంచి మొత్తం ప్రపంచానికి పాకింది.