క‌రోనా వ్యాక్సిన్ కు కేరాఫ్ అడ్ర‌స్ ఇండియానే

క‌రోనా వ్యాక్సిన్ కు కేరాఫ్ అడ్ర‌స్ ఇండియానే

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ , సరఫరాలో ప్రపంచ దేశాలకు కేరాఫ్ఇండియానే అవుతుందని అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ ఫెక్షియస్ డిసీజ్ చీఫ్ , ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెల్త్ అడ్వైజ‌ర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. ఇండియన్ కౌన్సి ల్ మెడిక‌ల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)
ఏర్పాటు చేసిన వెబ్ కాన్ఫ‌రెన్స్ లో ఆయన మాట్లాడారు. మోడర్నా, ఫైజ‌ర్ కంపెనీల వ్యాక్సిన్ లు అడ్వాన్స్ టెక్నిలిక‌ల్ ట్రయల్స్ స్టేజ్ లో ఉన్నాయన్నారు. అయితే, కరోనా ఎంత తీవ్రంగా ఉన్నా.. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అభివృద్ధి కోసం పడిపడి ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘ప్రపంచ
దేశాలకు వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాకు సంబంధించి ఇప్పుడు ఇండియాకు ఉన్న శక్తే కీలకం కాబోతోంది.వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ లో రెగ్యులేటరీ స్టాండ‌ర్ట్స్ తగ్గట్టు ఉండాల్సిందే”అని ఆయన చెప్పారు.