కరోనా గురించి పట్టించుకోండి.., లేదంటే మిలియన్ల ప్రాణాలు గాల్లోనే

కరోనా గురించి పట్టించుకోండి.., లేదంటే మిలియన్ల ప్రాణాలు గాల్లోనే
లండన్ మరియు సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లలో కరోనా వైరస్ విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. దేశంలో కరోనా పరిస్థితి చేయి దాటి పోయిందని, లాక్ డౌన్ తరువాత కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉందన్నారు. లాక్ డౌన్ తరువాత క్రిస్మస్ కంటే ముందే 16 మిలియన్ల మంది ప్రజలకు కరోనా అటాక్ అయినట్లు బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హ్యాన్ కాక్ తెలిపారు. అంతేకాదు క్రిస్మస్ పండుగ సంఖ్య కరోనా వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఉన్న జనాభాలో 3 శాతం మంది మాత్రమే కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారని, మిగిలిన వారు పట్టించుకోవడం లేదన్నారు.  దేశం మొత్తం వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు తాము మద్దతు తెలిపితే.., వాటిపై తన నిర్ణయం  చెప్పేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్ మరో 11 గంటలు తరువాత నిర్ణయం గురించి స్పందిస్తారని బ్రిటన్ ప్రతిపక్షపార్టీ నేత కైర్ స్టార్మర్ మండిపడ్డారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రధాని పట్టించుకోకపోతే.., క్రిస్మస్ తరువాత మిలియన్ల కుటుంబాలకు సంతాపం తెలపాల్సి ఉంటుందన్నారు.